టోక్యో ఒలింపిక్స్‌ టికెట్‌ డబ్బులు వాపస్‌

నిర్వాహక కమిటీ వెల్లడి

Tokyo Olympics ticket refunded
Tokyo Olympics ticket refunded

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌కోసం టిక్కెట్లు కొన్న అభిమానులు డబ్బులు వాపసు తీసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్టు నిర్వాహక కమిటీ తెలిపింది.

జపాన్‌లో టిక్కెట్లు కొన్నవారికే ఈ సౌకర్యం కల్పించనున్నారు. అయితే జపాన్‌ వెలుపల కొన్న టిక్కెట్లకు ఈ సౌకర్యం వర్తించదు.

వచ్చే ఏడాదికి వాయిదాపడ్డ ఒలింపిక్స్‌ను చూడలేమని భావించేవారు టిక్కెట్‌ డబ్బులను ఆన్‌లైన్‌ద్వారా వాపసు తీసుకోవచ్చని, ఈ సౌకర్యం నవంబర్‌ 10-30 తేదీలలో అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

పారాఒలింపిక్స్‌ టికెట్ల డబ్బులు డిసెంబర్‌ 1-21 తేదీలలో వాపసు చేస్తారు. కొవిడ్‌-19 కారణంగా ఒలింపిక్స్‌ సీట్లను పరిమితం చేయనున్న కారణంగా ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామని, క్రీడలను నేరుగా చూడదలచుకోని వారు డబ్బు వాపసు తీసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

సవరించిన తేదీల ప్రకారం ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది జులై 23న ఆరంభమౌతాయి.

కొవిడ్‌ వాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాకపోవడం, క్రీడాకారులు, వారితో వచ్చే అధికారులు, కోచ్‌లు, ఇతర సిబ్బందికి క్వారంటైన్‌ నిబంధనల అమలు కష్టసాధ్యమని నిపుణులు భావిస్తున్నారు.

ఇక విదేశాలనుంచి వచ్చే అభిమానుల విషయమై స్పష్టమైన అవగాహన లేదు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/