సెమీస్‌లో ఓడిన భారత పురుషుల హాకీ జట్టు
కాంస్యం పైనే ఆశలు
Tokyo Olympics: Indian men’s hockey team loses to Belgium in semi-final
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ హాకీలో అద్భుత ఆటతీరుతో తొలి నుంచి ఆకట్టుకున్న భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌లో బోల్తాపడింది. కొద్దిసేపటి క్రితం జరిగిన సెమీస్ పోరులో ప్రపంచ నంబర్ వన్ అయిన బెల్జియం చేతిలో 5-2తో ఓటమి పాలైంది. తొలి రెండు క్వార్టర్లలోనూ 2-1తో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన మన్‌ప్రీత్ సేన చివరి క్వార్టర్లో చేతులెత్తేసింది. బెల్జియం ఆటగాళ్లను డిఫెండ్ చేసుకోలేక వరుస గోల్స్ సమర్పించుకుని ఓటమి పాలయ్యారు. అయితే, భారత జట్టు స్వర్ణం, రజతం ఆశలు చేజారినప్పటికీ కాంస్య పతకం ఆశలు సజీవంగా ఉన్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/