వాడా నాలుగేళ్ల నిషేధంపై రష్యా సవాల్

మాస్కో: అంతర్జాతీయ డోపింగ్ సంస్థ(వాడా) విధించిన నిషేధాన్ని రష్యా సవాల్ చేసింది. డోపింగ్ విభాగంలో అర్హత సాధించని కారణంగా రష్యాకు నాలుగేళ్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
నిషేధంపై అప్పీల్ చేసుకునేందుకు రష్యాకు వాడా 21 రోజుల నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా నిషేధంపై అప్పీల్ నేపథ్యంలో రష్యా డోపింగ్ నిరోధక సంస్థ(రుసాడ) పలు ఆధారాలతో ఓ నివేదికను వాడాకు పంపింది. ఈ అప్పీల్లో తమపై విధించిన నిషేధాన్ని నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. నిషేధంపై రుసాడ అప్పీల్ చేయడంతో ఈ విషయం ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కోర్టుకు చేరనుంది. కాగా ఈ అంశంపై రుసాడ డైరెక్టర్ యూరీ గనస్ మాట్లాడుతూ.. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను వాడాకు సమర్పించాం. విధించిన ఆంక్షలను విభేదిస్తున్నట్లు అందులో పేర్కొన్నాం అని ఆయన అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/