పిల్లల్లో మూత్రవిసర్జన నివారణ
పిల్లల్లో మూత్రవిసర్జన నివారణ

కొంతమంది పిల్లలలో మూత్రపిండాల్లోనూ, ఇతర మూత్ర మార్గాల్లోనూ జన్మతః నిర్మాణ పరమైన లోపాలు ఉంటాయి. తత్ఫలితంగా మూత్రం తయారీ విడుదలలో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఇటువంటి సమస్యలున్నప్పుడు పరిస్థితిని మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది. మలబద్ధకం ఉందా? మలబద్ధకం ఉండే పిల్లలలో పెద్దప్రేవు చిరవనుండే పురీష నాళం (రెక్టం) పూర్తిగా మలంతో నిండిపోయి దాని ముందుభాగంలో ఉడే మూత్రకోశం మీద ఒత్తిడిని కలిగిస్తుంది. దీనితో మూత్రకోశం వాల్వు వదులై శయ్యా మూత్ర మవుతుంది. ఆహారంలో పీచు పదార్థాలను చేర్చ డం, రోజా పుష్పలేహ్యం వంటి మృదు విరేచన ఔషధాలను ఇవ్వడం ద్వారా ఈ సమస్యను అధి గమించవచ్చు. ఎప్పుడూ ఆందోళనగా కనిపిస్తారా? పిల్లలకు ఏ మాత్రం భయం, ఆందోళనలు కలిగినా వెంటనే పక్క తడిపేస్తారు. మానసిక వత్తిడి, భయాల వలన మూత్రకోశపు కండరాలతో సహా శరీరంలోని కండరాలన్నీ అసంకల్పితంగా బిగుసుకుంటాయి. దీనితో పక్కలో మూత్రం పోస్తారు. రాత్రిపూట భయం కలిగించే కథలు, సినిమాలు, టీవీ కార్యక్ర మాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. ఎప్పు డూ దాహంగా ఉంటుం దా?
అకారణంగా బరువు తగ్గుతున్నారా? కొంత మంది పిల్లలలో మధు మేహం (జువనైల్ డయా బెటిస్) శయ్యామూత్రంతో మొదలవుతుంది. ఇన్సు లిన్ హార్మోన్ లోపం వలన శారీరక కణజాలా లు రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా గ్రహించలేవు. ఫలితంగా రక్తంలోని చక్కెర రక్తంలోనే పెరిగిపోతుం టుంది. అయితే ఇలా పెరగడం ప్రమాదకరం కాబట్టి మూత్రపిండాలు మూత్రాన్ని పెద్ద మొత్తాల్లో తయారు చేస్తూ చక్కెరను విసర్జించే ప్రయత్నం చేస్తాయి. ఈ నేపథ్యంలో మూత్రకోశపు పరి మాణానికి మించి మూత్రం తయారవుతుంది కాబట్టి నిద్రలో అసంకల్పితంగా విడుదలవు తుంది. శరీరంనుంచి బైటకు వెళ్లిపోయిన నీరు తిరిగి భర్తీ కావాలి కనుక అధికంగా దప్పిక అవుతుంది. ఈ స్థితులన్నీ చక్రభ్రమణంలాగా ఒకదానిని అనుసరించి మరొకటి జరుగుతుం టాయి. సరైన వ్యాయామం, సక్రమమైన ఆహారం, సమర్థవం తమైన ఔషధాలతో ఈ స్థితికి చికిత్స చేయాలి.