నేడు, రేపు సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు, రేపు వివిధ అంశాలపై అధికారులతో కీలక స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌రోనా వ‌ల్ల రాష్ట్రానికి జ‌రిగిన ఆర్థిక న‌ష్టంపై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఆదాయానికి అనుగుణంగా ప్ర‌భుత్వం తీసుకోవాల్సిన‌ చ‌ర్య‌లు, స‌వ‌రించుకోవాల్సిన అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. క‌రోనా నియంత్ర‌ణ‌కు చేపట్టిన చ‌ర్య‌లు, సవ‌రించాల్సిన అంశాల‌పై అధికారుల‌తో చ‌ర్చిస్తారు. ‌2020-21 బ‌డ్జెట్ స‌మావేశాల‌పై సిఎం మ‌ధ్యంత‌ర స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు యాదాద్రి ఆల‌య ప‌నుల‌పై స‌మీక్షించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి దేవాల‌య నిర్మాణ ప‌నుల్లో పురోగ‌తిపై అధికారుల‌తో చ‌ర్చిస్తారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/