నేడు ఆకాశంలో అద్భుతం

400 యేళ్ల తర్వాత మళ్ళీ ఇపుడు

Today the sky is awesome
Today the sky is awesome

న్యూయార్క్‌: నాలుగు వందల ఏళ్ల క్రితం ఆకాశంలో సంభవించిన ఓ ఆద్భుతం మళ్లీ సోమవారం ఆవిష్కృతమవ్వబోతున్నది. శని, బృహస్పతి గ్రహాలు పరస్పరం అత్యంత దగ్గరగా ఒకే సరళ రేఖ మీదకు రాబోతున్నాయి.

సౌర కుటుంబంలో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూనే తమ చుట్టు తాము తిరుగుతూ ఉంటాయి. ఆవిధంగా తిరిగే క్రమంలో అనంతమైన కాల గమనంలో వందలు వేల ఏళ్లకు, ఒక్కోసారి లక్షల సంవత్సరాలకు కొన్ని అద్భుతాలు ఆకాశంలో పునరావృతం అవుతూ ఉంటాయి. సోమవారం జరగబోయే అద్భుతం కూడా అటువంటిదే. ఈ అద్భుతాన్ని క్రిస్మస్‌ స్టార్‌ అని పిలుస్తారు.

గెలీలియో టెలిస్కోప్‌ని కనిపెట్టిన పదమూడేళ్ల అనంతరం 1623లో అంతరిక్షంలో మొదటి సారిగా క్రిస్మస్‌ స్టార్‌ని భూగ్రహ వాసులు చూశారు.

అయితే శని, బృహస్పతి గ్రహాలు దగ్గరగా ఒకే వరుసలోకి వచ్చే ఘట్టం రాత్రిపూట జరిగి 800 యేళ్లు అయిందని నాసా పేర్కొంది. సోమవారం కనిపించనున్న క్రిస్మస్‌ స్టార్‌ మళ్లీ 60 ఏళ్ల తర్వాత దర్శనమిస్తుందని కూడా నాసా పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/