నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20

బెంగళూరు: టీమిండియా ఆస్ట్రేలియాతో రెండో టీ20కి సిద్దమైంది. ఈసందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో రసవత్తర పోరు సాగనుంది. రెండో టీ20కి భారత జట్టులో మార్పులు జరిగే అవకాశముంది. ప్రపంచకప్ ముంగిట రొటేషన్ విధానాన్ని అనుసరిస్తున్న భారత్.. తొలి మ్యాచ్‌కు శిఖర్ ధావన్‌కు విశ్రాంతినిచ్చింది. అతడిని బుధవారం ఆడించే అవకాశముంది. తొలి టీ20లో సత్తా చాటిన కేఎల్ రాహుల్‌కు మరిన్ని అవకాశాలివ్వాలని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి రోహిత్‌కు విశ్రాంతినిచ్చి ధావన్‌ను ఆడిస్తారని సమాచారం. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ల్లో ఒకరిని పక్కన పెట్టి ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఆడించే అవకాశాల్నీ కొట్టి పారేయలేం. వైజాగ్ టీ20లో విఫలమైన ఉమేశ్ యాదవ్ స్థానంలో సిద్దార్థ్ కౌల్‌ను తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో