సిరీస్ పై కన్నేసిన టీమిండియా

జోరుమీదున్న టీమిండియా

సౌతాఫ్రికా తో ఆఖరి టీ 20 నేడు. బలంగా ఉన్న కోహ్లీ సేనను తట్టుకోవటం సఫారీలకు సవాలే. అయినప్పటికీ రిషబ్ పంత్ ఆందోళన కలిగిస్తున్నాడు తాను ఆడిన చివరి 10 టీ20 ఇన్నింగ్స్లో 7ఇన్నింగ్స్ లో రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయాడు. ఒత్తిడితో ఉన్న పంత్ కి ఈ మ్యాచ్ పెద్ద పరీక్షే. టాప్ లో రోహిత్ ధావన్ కోహ్లీ తో బలంగా ఉన్నప్పటికీ నాలుగో స్థానం లో శ్రేయాస్ అయ్యర్ ను దించే అవకాశం ఉంది, ఆ విధంగా పంత్ పైన ఒత్తిడి తగ్గనుంది. ముఖ్యమైన ఫేసర్లు లేకున్నా భారత జట్టు బౌలింగ్ కూడా బలంగానే ఉంది అని చెప్పుకోవాలి. బౌండరీ చిన్నదిగా ఉన్న చిన్నస్వామి స్టేడియం లో స్పిన్నర్లకు కష్టమే. ఏదేమైనా మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారమవును .

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/