నేడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్నదాతల నిరాహార దీక్షలు

ఢిల్లీలో రైతు నేతల నిరాహారదీక్ష మద్దతుగా దీక్ష చేపట్టనున్న కేజ్రీవాల్‌

Farmers’ protest

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీ సరిహద్దుల్లో అన్ని రైతు సంఘాల నాయకులు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. రైతులకు మద్దతుగా తాను కూడా నిరాహార దీక్ష చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఆప్‌ కార్యకర్తలతోపాటు దేశ ప్రజలందరూ ఒక్క రోజు దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు, కొత్త చట్టాలపై ప్రభుత్వానికి పలువురు రైతులు మద్దతు ప్రకటిస్తున్నారని, వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు ఉద్యమ నేతలు స్పష్టంచేశారు. ప్రభుత్వంతో చేతులు కలిపి తమ పోరాటానికి వెన్నుపోటు పొడవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆదివారం రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్‌ నుంచి రైతన్నలు ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించగా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/