ముగిసిన ఉపవాస దీక్షలు..నేడు రంజాన్‌

ramzan
ramzan

హైదరాబాద్‌: ముస్లింల రంజాన్‌ ఉపవాస దీక్షలు మంగళవారం రాత్రి ముగిశాయి. రాత్రి 7.30 గంటలకు ఆకాశంలో నెలవంక కనిపించినట్లుగా రుయ్యత్‌ ఏహిలాల్‌ కమిటి తెలియజేసిందని మక్కా మసీదు సూపరింటెండెంట్‌ ఎం. ఖదీర్‌ సిద్ధిఖ్‌ వివరించారు. ఈరోజు ఉదయం రంజాన్ పండుగ ముగింపు సందర్భంగా సామూహిక ప్రార్థనల కోసం పాతనగరంతోపాటు సికింద్రాబాద్‌లోని పలు మసీదులను, ఈద్గాలను అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంచేశారు. ఎండలు మండుతుండటంతో పలు ప్రాంతాల్లో షామియానాలు, చలువ చద్దర్లు, పందిర్లను ఏర్పాటుచేశారు.
రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ సిఎం కెసిఆర్‌ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/