విశ్వాసానికే వెలుగు

Christmas

నేడు క్రిస్మస్‌ పండుగ. వేకువజామునే లేచి ప్రభువ్ఞను ఆరాధించేవారు కొందరైతే, మధ్యరాత్రివేళ చర్చిలకు వెళ్లి మరికొందరు ఆరాధిస్తారు. నూతన వస్త్రాలతో ముస్తాబై, ఆనందంగా చర్చిలకు వెళ్లి, ప్రభువ్ఞను పూజిస్తారు. బంధువ్ఞలు, స్నేహితులు కలిసి క్రిస్మస్‌ శుభాకాంక్షల్ని తెలుపుకుంటారు. కానీ క్రిస్మస్‌ అర్ధాన్ని తెలుసుకుని, ప్రభువ్ఞను ఆరాధించేవారు కొద్దిమంది మాత్రమే. నిజమైన ఆనందం నూతన వస్త్రాలతో రాదుకానీ, రక్షణ అనే ‘నూతన వస్త్రంతోనే లభిస్తుంది. ఈ ఆనందం ఎవరూ దొంగలించలేనిది. ఏడాది అంతా నూతనంగా సంతోషం ఉదయిస్తూనే ఉంటుంది. ఇలాంటి ఆనందం కోసమే ప్రభువ్ఞ ఈలోకంలో జన్మించాడు. ఇట్టి అర్ధంతో వేడుకుల్ని జరుపుకునేందుకు ఇదే ఆహ్వానం..

‘సర్వోన్నతమైన స్థలములలో దేవ్ఞనికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమివిూద సమాధానమును కలుగునుగాక అని దేవ్ఞని స్తోత్రము చేయుచుండెను (లూకా 2:14) యేసుప్రభువ్ఞ జన్మించిన తర్వాత పరలోకంలోని సైన్యసమూహం, ప్రభువ్ఞ దూతతో కలిసి స్తుతించిన సందర్భంలో రాయబడిన వాక్యం. నవంబరు 25వ తేదీ నుంచే క్రిస్మస్‌ వేడుకల్ని ఆరంభిస్తారు. క్రైస్తవ దేశాలు క్రిస్మస్‌ పండుగను దాదాపు నెలరోజులుగా ఆర్భాటంతో చేసుకుంటారు. క్రిస్మస్‌ అంటే క్రైస్ట్‌+మాస్‌ దేవ్ఞడి ప్రజలు ప్రభువ్ఞను ఆరాధించడం. ఈ పండుగ దేవ్ఞడికి మహిమకరంగాను మనకు సమాధా నంగా ఉండాలి. ప్రభువ్ఞ జన్మించినప్పుడు గొర్రెల కాపరులు, జ్ఞానులు శిశువ్ఞను ఆరాధించారు. గొర్రెల కాపరులు స్తోత్రం చేస్తూ తమ సొంత స్థలాలకు వెళ్లిపోయారు. తూర్పుదేశపు జ్ఞానులు ఆకాశంలో నక్షత్రాన్ని చూసి, యూదుల రాజుగా జన్మించాడని గ్రహించి, ఆయనను పూజించేందుకు వచ్చారు. వారికి మార్గం తెలియకపోవడం వల్ల ఆకాశంలోని నక్షత్రం వారికి దారిని చూపించింది. ఆ నక్షత్రాన్ని వారు అనుసరించారు. నక్షత్రం ప్రభువ్ఞ జన్మించిన స్థలంలో నిలిచినప్పుడు వారు ఇంట్లోకి వెళ్లి తల్లి అయిన మరియను, శిశువ్ఞను చూసి, ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారు ప్రభువ్ఞను మాత్రమే పూజించారు. బంగారు, సాంబ్రాణి, బోళమును కానుకగా సమర్పించారు. ఆరాధించి, సంతోషంతో తమ దేశానికి తిరిగి వెళ్లారు. గొర్రెల కాపరులు ప్రభువ్ఞను స్తుతించారు, జ్ఞానులు ప్రభువ్ఞను స్తుతించారు. మరి మనం కూడా ప్రభువ్ఞను ఆరాధిస్తున్నామా? ఆయనను ఘనపరుస్తున్నామా? లేకపోతే పండుగ ఆచారాల్లో మునిగిపోయి, దేవ్ఞడు ఈలోకానికి వచ్చిన ఉద్దేశాన్ని విస్మరిస్తున్నామా? ప్రభువ్ఞను హృదయంలో సొంత రక్షకుడిగా ప్రతిష్టించుకోలేకపోతే ఈ క్రిస్మస్‌ ఇతర పండుగల్లాగానే మిగిలిపోతుంది. పండుగ అంటే క్రిస్మస్‌ ట్రీని పెట్టుకోవడం, ఇంటిని అందంగా డెకరేషన్‌ చేసుకోవడం, ఇంటిముందు స్టార్‌ పెట్టుకోవడం, పిండివంటలు, ఘమఘమలాడే వంటలు, కొత్తబట్టలు ఇవన్నీ భౌతికంగా మనం చేసుకునే ఆర్భాటమే. మరి ఆధ్యాత్మికంగా ప్రభువ్ఞకు సమీపంలో జీవిస్తున్నామా? మెటీరియల్‌ థింక్స్‌తో పండుగను చేసుకోవడంలో తప్పులేదు. కానీ అవన్నీ ప్రభువ్ఞకు సమీపంలోకి నడిపించే సాధనాలుగా మాత్రమే ఉపయోగించుకోవాలి. క్రిస్మస్‌ అంటే ప్రభువ్ఞను ఆరాధించడం ఒక్కటే మన గురిగా, లక్ష్యంగా ఉండాలి. శాంటాక్లాజ్‌ కూడా పేదలకు కానుకల్ని పంచే ఒక మానవతావాదిగా మనం చూడాలి తప్ప, అదేదో ఫన్నీథింక్‌గా భావించకూడదు. కామెడీ కింగ్‌గా మార్చివేసి, కేరింతలు కొట్టడం అసలే కాదు. ఈ సీజన్‌లో ఎవరు ఎక్కువగా కనిపించాలి? ప్రభువా? శాంటాక్లాజ్‌నా? సర్వలోక రక్షణ కోసం ప్రభువ్ఞ ఈలోకానికి వచ్చాడు. మరియ ప్రభువ్ఞను ఆరాధించింది. జెకర్యా ప్రభువ్ఞను ఆరాధించాడు. సుమెయోను ఆరాధించాడు.

ప్రవక్త్రి అయిన అన్న కూడా దేవ్ఞడిని స్తుతించింది. చివరికి గొర్రెల కాపరులు, జ్ఞానులు దేవ్ఞడిని పూజించారు. లేఖనాలల్లో ఇంత స్పష్టంగా దేవ్ఞడిని ఆరాధించారు. మనం కూడా ఆరాధించాలి. ఆర్భాటాలతో వేడుకల్ని జరుపుకోవడం తప్పు కాదు కానీ ఆ వేడుకల్లో ప్రభువ్ఞను విస్మరించి, శాంటాక్లాజ్‌ క్రేజ్‌లో కొట్టుమిట్టాడుతున్న ఆధునిక పోకడలు విస్మయాన్ని కల్పిస్తున్నది.
ఈ పండుగ సీజన్‌ అనేకుల హృదయాల్లో రక్షణ కార్యం జరగాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పండుగను ఆచరించాలని ఆనాటి మతపెద్దలు, పండితులు నిర్ణయించారు. ఇది ఒక ఆచారం కాదు, అలవాటు అసలేకాదు.
ఆయన జన్మించకపోతే సిలువలో మరణించేవాడు కాడు. ప్రభువ్ఞ మరణించకపోతే మనకు పాపక్షమాపణ, విడుదల లేదు. మనల్ని రక్షించేందు కు జన్మించిన ప్రభువ్ఞను ఆనందంతో మనం ఉప్పొంగిపోవాలి. ఈ ఆనందం ఒక్క క్రిస్మస్‌ నాడు మాత్రమే
కాదు ఏడాది అంతా ఉండాలి. దేవ్ఞడిని సొంత రక్షకుడి గా అంగీకరించినప్పుడు మనకు ప్రతిదినం క్రిస్మస్‌ ఆనం దమే ఉంటుంది. ఇలాంటి ఆనందం మనం పొందేందుకే ప్రభువ్ఞ జన్మించాడు. అల్లరితో కూడిన ఆటపాటలకు ఏ మాత్రం చోటు ఇవ్వ కూడదు. క్రిస్మస్‌ సంబరాలు కూడా హుందా గా, ప్రభువ్ఞ నామానికి మహి మకంగా జరుపుకోవాలి.
రానున్న తరాలకు క్రిస్మస్‌ అంటే భక్తిభావాన్ని పెంపొందేలా, రక్షణ కార్యం జరిగేలా మనవంతు కృషి చేయాలి. ఇది మన బాధ్యత, కర్తవ్యం.

– పి.వాణీపుష్ప

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/