ఈరోజు చిరస్మరణీయమైన రోజు

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

విజయవాడ: ఏపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కార్గిల్‌ వార్‌లో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఈరోజు చిరస్మరణీయమైన రోజు అని చెప్పారు. కార్గిల్‌లో అమరులైన వీర జవాన్ల కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. ప్రతీ పౌరుడు ఐదు మొక్కలు నాటి సంరక్షిస్తే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సందేమిచ్చారు. అమర వీరుల త్యాగానికి ప్రతీకగా దేశ ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/