నేడు – రేపు వర్షాలు పడే అవకాశం!

ద్రోణి ప్రభావం.. హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ శాఖ

rain fall
rain fall

హైదరాబాద్‌: నేడు, రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి కేరళ వరకు, రాయలసీమ నుంచి కర్ణాటక వరకు ఈ ద్రోణి ఆవరించి ఉందని, దీని కారణంగా పలుచోట్ల వడగళ్ల వానలు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/