నేడు ‘రైతు భరోసా’, పంట ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల ఖాతాలకు జమ
రైతు భరోసా కింద రూ.1,120కోట్లు -పలు సంక్షేమ పథకాలపై అధికారులకు సిఎం జగన్ మార్గదర్శకాలు

Amaravati: రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తు న్నట్లు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు.
ఈ క్రమంలోనే రైతుల ఖా తాలకు రైతు భరోసా కింద 51.59లక్షల మందికి రూ.1,120 కోట్ల్లును నేరుగా వారి ఖాతాల్ల్లోకి జమచేస్తోందని చెప్పారు.వాటితో పాటు నివర్ తుఫాను బాధితరైతులు అందరికి 12.01లక్షల ఎకరాల్లోనష్టం వాటిల్లిందన్నారు.జరిగిన నష్టానికి పరిహరంగా రూ.646 కోట్లు ఇన్‌పుట్ సబ్సీడిని వారి ఖాతాలకు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం(ఈనెల29న)రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సీ డీలను రైతులకు ఖాతాకు ఒకే పర్యాయం జమ చే యడంపైన,పరిశ్రమల్లో భద్రతా చర్యలు తది తరంశాలపై సీఎం జగన్ అధికారులతో నేరుగా మాట్లాడారు. పలు సంక్షేమ కార్యక్ర మాలపైన పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ఒక పారి శ్రామిక భద్రత విధానం ఉండాలని జగన్ వ్యా ఖ్యానించారు.ఈ దిశలోనే గతంలో మనం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సేప్ట్టీ పాలసీని తీసుకుని రావడం జరుగుతుందన్నారు. పరిశ్రమల భద్రత కోసం ప్రస్త్తుతమున్న రెగ్యు లేటరీ వ్యవస్ద్దలన్ని సెప్ట్టీ పాలసీ కిందకు తీసుకుని రావాలనే దిశలో ప్రభుత్వం అడుగులు మందుకు వేస్తుందన్నారు.. పరిశ్రమల భద్రత,పర్యావరణ పరిరక్షణకు అమలు చేస్తున్న నిబంధనల పరిశీలనకు జిల్ల్లా స్దాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ కమిటీల్ల్లో చైర్మన్‌గా జిల్ల్లాజాయింట్ కలెక్ట్టరు,ఇన్‌స్పెక్ట్టరు ఆఫ్ ప్యాక్ట్టరీస్,ఇన్‌స్పెక్ట్టరు ఆప్ బాయిలర్స్,కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి, డిప్యూటి ఎలక్ట్ట్రికల్ ఇన్‌స్పెక్ట్టరు, జిల్ల్లా అగ్నిమాపకశాఖ అధికారి,జిల్లా పరిశ్రమలశాఖ అధికారులుంటారు.కమిటీల విధివిధానాలపై ఇప్పటికే అధికారులు రూపొం దించిన నివేదికలపై. ముఖ్యమంత్రి జగన్ తాజా అంశాలపై అధికారులను ఆరా తీసారు.
ఈ కమిటీలు గుర్త్తించిన లోపాలను సరిచేసి,అందుకు సంబంధించిన నివేదికను నిర్ద్దేశిత నమూనాలో 30రోజులలోపు పరిశ్రమల నిర్వాహకులకు అం దించాలన్నారు. విశాఖపట్నంలోని బ్రాండిక్స్‌కు పునాది వేసి సుమారు 30వేల కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పించడం గర్వించదగ్గ విషయ మన్నారు.
అక్కడ మహిళాసాధికారితకు పెద్దపీట వేసేలా ఎక్కువశాతం మహిళామణులే కుటుం బాలను ముందుండి నడిపిస్తుండడం మరో చెప్పు కోదగ్గ విషయని పేర్కొన్నారు.వస్త్ర తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలిపేలా మౌలిక సదుపాయాలు అందజేయడంతోపాటు టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి 50% రాయితీ అందించనున్నారు.
పారిశ్రామికాభివృద్ది దృక్పథంతోనే విశాఖపట్ట్టణంలో హైఎండ్ ఐటీ స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
నూతన పారిశ్రామిక విధానాన్ని ఉపాధి అవకాల కల్పన, ప్రాంతాల నడుమ సమతుల్యత,పర్యావరణ పరిరక్షణాంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించాలన్నారు.
ఎంఎస్‌ఎంఈల అభివృద్ద్దికి పూర్తిగా ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసే వస్తుసేవల్లో కనీసం 25శాతం సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల నుంచి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేసా మన్నారు.
అందులోను నాలుగు శాతం ఎస్సీ,ఎస్టీ మహిళా యాజమాన్యాలు నిర్వహిస్తున్న సంస్దల నుంచి కొనుగోలు చేస్త్తామన్నారు.ఇలా చేసిన కొను గోళ్లకు చెల్లింపులు ఎప్పటికప్పుడు జరుగు తా యని స్పష్టం చేసారు.ఎంఎస్‌ఎంఈలకు టెం డరు సెట్లఫీజు,కనీసటర్నోవరు నిబంధనల నుం డి మినహయింపును ఇస్తున్నట్ల్లు తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/