నేడు వైఎస్‌ఆర్‌సిపిలోకి ఆరుగురు నేతలు

YSRCP
YSRCP


హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల వలసలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి కండువా కప్పుకున్నారు. మరోవైపు టిడిపి కూడా వైఎస్‌ఆర్‌సిపి నేతలకు ఎరవేస్తుంది.
నేడు జగన్‌ సమక్షంలో రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన ఆరుగురు కీలక నేతలు వైఎస్‌ఆర్‌సిపిలో చేరుతున్నారు. వారిలో కొణతాల రామకృష్ణ, బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వంగా గీత, బల్లి దుర్గా ప్రసాద్‌, ఆదాల ప్రభాకరరెడ్డి వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్నారు. జగన్‌ ప్రస్తుతం కడప జిల్లాలో వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌కు రాగానే వీరు ఈ ఆరుగురు పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు.

తాజా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/