‘పొగ’ తగ్గితేనే కరోనా కట్టడి

పొగాకు ఉత్పత్తులు, అమ్మకాలు, వినియోగం పూర్తిగా నిషేధించాలి

Tobacco products should be completely banned
Tobacco products should be completely banned

కరోనా మళ్లీ విజృంభించనుందనే సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్రప్రభుత్వంతోపాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకు వేసి నిబంధనలను విధించింది. మళ్లీ రాత్రిపూట లాక్‌డౌన్‌ విధించేందుకు కూడా సమాయత్తం అవ్ఞతున్నట్లు సమాచారం.

ఇక భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రక్కసి మళ్లీ పంజా విసిరేఅవకాశాలున్నట్లు వైద్యనిపుణులే హెచ్చరించడంతో అనేక దేశాలుఅప్రమత్తం అయ్యాయి.అమెరికాలో ఇప్పటికే రెండో దశలో ఈ వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నది.

చలికాలంలో ఈ వ్యాధి విస్తరణకు ఎక్కువ అవకాశాలున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధూమపానంతో వచ్చే పొగతో వినియోగదారుడే కాదు, అతని సమీపంలో ఉన్న వారికి కూడా ఈ వ్యాధి విస్తరిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.

.పొగాకుఉత్పత్తులు అధికంగా వాడే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్త రిస్తున్న ఈ తరుణంలో పాలకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

పొగాకు వాడకందారులు భారత్‌లో ఇరవై ఐదు కోట్లకుపైగా ఉన్నట్లు గ్లోబల్‌ అడల్‌ తొబాకో సర్వే వెల్లడిస్తున్నది. అటు ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ భారత్‌ రెండోస్థానంలో ఉండటంతో దేశం లో పొగాకు కారణంగా వచ్చే వ్యాధులవల్ల ఏటా తొమ్మిది లక్షల మందికిపైగా మరణిస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులే వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రోజుకు మూడువేల ఐదు వందల మందినిపైగా ఈ పొగాకు కబళిస్తున్నది.

చుట్టా, బిడీ, సిగరెట్‌, గుట్కా, హుక్కా, ఏ పేరుతో పిలిచినా అన్నింటికి మూలం పొగాకు అనేది అందరికి తెలిసిందే. అనారోగ్య కారణాల్లో ధూమపానం మూడు నుంచి రెండో స్థానానికి చేరుకున్నది.పొగాకు ఉత్పత్తులు ఆధునిక సమాజాల్లో నిశ్శబ్ధ విలయం సృష్టిస్తున్నాయి

.ప్రాణాంతక పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఒకటిన్నర దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

2003లో బహిరంగ ధూమపా నాన్ని నిషేధించడంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా పొగాకు ప్రకటనలు గుప్పించడాన్ని నియంత్రించారు. అలాగే సిగరెట్‌పెట్టెలు, బిడీకట్టలపై వాటి వినియోగం ఎంత ప్రమాదకరమో తెలియచేస్తూ ముద్రించాలన్న నిబంధనలను కూడా అమలులోకి తెచ్చారు. అయినా ఇది ఏమాత్రం తగ్గడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ధూమపానంలో మునిగితేలుతున్నట్లు అంకెలు చెప్తున్నాయి. భారతదేశానికి సంబంధించినంతవరకు ఇరవైఐదు కోట్ల మందికిపైగా పొగాకుకు అలవాటు పడ్డారు. ఇందులో బిడీలు తాగేవారే అధికంగా ఉన్నారు.

బిడీలు, సిగరెట్‌లు తాగడం సరదాగా ఆరంభమై ఆ తర్వాత అలవాటుగా మారిపోతున్నది. పదిహేనేళ్ల వయ సులోనే ఇది ఆరంభంకావడం ఆందోళన కలిగించేఅంశం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోగాలబారినపడుతుంటే లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సిగరెట్‌ పొగలో 4,800లకుపైగా ప్రమాదకర విషవాయువులున్నాయని గుర్తించారు.

ఇవి అనేక రోగాలకు కారణాలవ్ఞ తున్నాయి. అటు ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ పట్టిపీడిస్తున్న ఈ ధూమపానాన్ని పారద్రోలే విషయంలో పాలకులు త్రికరణశుద్ధిగా వ్యవహరించలేకపోతున్నారు.

ఒకపక్క పొగాకు సాగును ప్రోత్సహిస్తూ మరొకపక్క నియంత్రించే చర్యలు చేపట్టడంతో పొంతన కుదరకుండా అమలుకు నోచుకోవడం లేదు. బిడీ కట్టల మీద భయం కొల్పే పుర్రేబొమ్మ, శవం బొమ్మ ముద్రించాలని గతంలో ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో లక్షలాది మంది బిడీ కార్మికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జీవనోపాధి కోల్పోతున్నామని, అప్పట్లో ఆందోళనకు దిగి రోడ్లపైకి వచ్చారు.వాస్తవంగా చూసినా బిడీ పరిశ్రమప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోట్లాది మంది బతుకుతెరువు ఇస్తున్నదనేది కాదనలేని సత్యం. అడవుల్లో ఉన్న లక్షలాది మంది గిరిజన కుటుంబాలకు బిడీ ఆకుసేకరణ ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. కొన్ని శతాబ్దాలుగా అదొక కుటీర పరి శ్రమగా వర్ధిల్లుతున్నది.

మరొకపక్క దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పొగాకు సాగుపై ఆధారపడి ఉన్నారు. తెలుగురాష్ట్రాల్లోనూ అనేక జిల్లాల్లో ఇప్పటికీ విస్తారంగానే పొగాకు పండిస్తున్నారు. గతంలో ప్రభుత్వమే ప్రోత్సాహ కాలు ఇచ్చి మరీ పొగాకు పంటను రైతులతో సాగు చేయించే అలవాటు చేయించారు. ఎక్కడిక్కడ పొగాకు బ్యారర్లు వెలిశాయి. రైతులతోపాటు లక్షలాది మంది రైతు కూలీలు కూడా దీనిపై ఆధారపడి ఉన్నారు.

ఆ కుటుంబాలు వీధిపాలు కాకుండా చూడాల్సిన బాధ్యతప్రభుత్వంపై ఉంది.వారికి ముందుగా ప్రత్యామ్నాయం చూపాలి.అవేమీ పట్టించుకోకుండా కాగితాలపై చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండదు. అంతేకాదు పాల కులు మరొక విషయాన్ని విస్మరిస్తున్నారు. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై వివిధ పన్నుల రూపంలో వేలాది కోట్ల రూపాయలు ఏటా వసూలు చేసుకుంటున్నది.

ఈ ఉత్పత్తులు అమ్ముకునేందుకు అధికారికంగా లైసెన్సులు ఇస్తున్నారు.ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్నారు. దేశంలో మంచినీరు దొరకని ప్రదేశాలు ఉన్నాయేమోకానీ,సిగరెట్లు, బిడీ దొరకని గ్రామాలు లేవనే చెప్పొచ్చు.

ఒకపక్క ఆదాయం కోసమే ప్రభుత్వం లైసెన్సు ఇచ్చి ప్రోత్సహిస్తూ మరొకపక్క నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభు త్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవనోపాధి కోల్పోతున్నవారికి ప్రత్యామ్నాయం చూపి పొగాకు ఉత్పత్తులను, అమ్మ కాలను, వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలి.

దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/