డెట్రాయిట్‌లో ట్రంప్‌ మద్దతుదారుల నిరసన

లోపలికి అనుమతించాలని డిమాండ్‌

to stop counting in Detroit-Trump supporters protest
to stop counting in Detroit-Trump supporters protest

Washington: డెట్రాయిట్‌లోని ఓ కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపును ఆపివేయాలని డిమాండ్‌ చేస్తూ ట్రంప్‌ మద్దతుదారులు నిరసన చేపట్టారు.

మరోవైపు కౌంటింగ్‌ జరుగుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు పనిని చూసేందుకు ప్రవేశం కల్పించాలంటూ నిరసన వ్యక్తంచేశారు.

ఇదిలా ఉండగా మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని ఇప్పటికే ట్రంప్‌ బృందం కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇక్కడ డెమోక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ ప్రత్యర్థి ట్రంప్‌ కంటే 37,350 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మొత్తం 16 ఎలక్ట్రోరల్‌ ఓట్లు ఉన్న మిచిగాన్‌ రాష్ట్రంలో బైడెన్‌ గెలుపు సాధిస్తే తమకు అధ్యక్షపీఠం ఖాయమని డెమోక్రాట్లు విశ్వాసంతో ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/