చుండ్రు తగ్గాలంటే ..

శిరోజాల సంరక్షణ

to reduce dandruff .
to reduce dandruff .

చలికాలంలో వాతావరణంలోతేమ తక్కువగా ఉంటుంది. చర్మం తొందరగా పొడిబారుతుంది. అలానే మాడు కూడా. చుండ్రు, కురులు నిర్జీవంగా కనిపించడం, దురద పుట్టడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే..

నూనె నిమ్మరసం : దురద పెట్టడం, పొట్టు మాదిరిగా లేవడం ఈ సీజన్‌ ఎక్కువ. ఈ సమస్య పోవాలంటే టీ స్పూన్‌ నిమ్మరసంలో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె లేదా కొబ్బరి నూనె వేసి కలపాలి.

తరువాత కొన్ని సెకన్లపాటు వేడిచేయాలి. ఇప్పుడు నేరుగా మాడుకుపట్టిస్తూ మసాజ్‌ చేయాలి. అరగంట తరువాత షాంపూ, కండీషనర్‌తో శుభ్రం చేసుకోవాలి. వారానకి రెండు సార్లు ఇలా చేస్తే సమస్య తగ్గుతుంది.

తాజా ‘ఆధ్యాత్మికం’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/