యవ్వనంలా కనిపించాలంటే ..

ఆరోగ్య చిట్కాలు

To look young

చాలా పాతకాలపు నానుడి.. లంఖణం పరమౌషధం! ఆ తరువాతి కాలంలో తిండి కలిగితేనే కండకలదోయ్ అన్నారు గానీ.. ఇటీవల కాలంలో మరోసారి సీన్‌ రివర్స్‌ అయింది. వయసు మీదపడ్డా ఆరోగ్య సమస్యలేవీ దరి చేరకూదనుకున్నా..

ఎక్కువ కాలం బతకాలని ఆశిస్తున్నా.. శరీరంలోని మంట/వాపులను తగ్గించుకోవాలని భావిస్తున్నా.. వీలైనంత తక్కువ ఆహారం తీసుకోవడమంత ఉత్తమమైన మార్గం లేదని అంటున్నారు చైనా, అమెరికా శాస్త్రవేత్తలు. అంతేకాదు కేలరీల నియంత్రణ ద్వారానే దీర్ఘాయుష్షు సాధ్యమన్న భావన వెనుక ఉన్న
అసలు ప్రక్రియ ఏమిటిన్నది కూడా మీరు అధ్యయనపూర్వకంగా తెలుసుకున్నారు.

వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల వ్యాధులు చుట్టుముట్టడం సహజం. కేన్సర్‌, మతిమరుపు, జీవక్రియలు మందగించడం.. ఇలా బోలెడన్ని సమస్యలు వృద్ధాప్యాన్ని ఆక్రమించే స్తుంటాయి. ఈ కార ణంగా ప్రభు త్వాలు వృధ్ధుల ఆరోగ్యం పై పెట్టా ల్సిన ఖర్చులు పెరిగిపోతాయి.

ఈ నేపథ్యంలో సాల్క్స్‌ జీ ఎక్స్‌ప్రెషన్‌ లేబొరేటరీకి చెందిన జువాన్‌ కార్లోస్‌ బెహమోంటే, చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లోని ప్రొఫెసర్‌ గువాంగ్‌ హుయి ల్యూలు ఎలుకలపై కొన్ని పరిశోధనలు చేశారు. ఆహా రాన్ని నియం త్రించ నప్పుడు ఎలుకల కణాల్లో ఏ రకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈపరిశీలనల ఆధారంగా వృద్ధాప్య సమస్యలను అధిగమించేందుకు మంచి మందులు తయారు చేయవచ్చునన్నది. వీరి అంచనా. తమ పరిశోధనల్లో భాగంగా బెహమోంటే కొన్ని ఎలుకలను ఎంచుకుని 30 శాతం తక్కువ కేలరీలు అందేలా చేశారు.

వీటిని సాధారణ స్థాయిలో ఆహారం తీసుకుంటున్న ఎలుకలతో పోల్చి చూశారు. మొత్తం 56 ఎలుకల్లోని కొవ్వు కాలేయ, కిడ్నీ, చర్మ, ఎముక మజ్జ, మెదడు, కండరం వంటి 40 రకాల కణాల్లో లక్షా అరవై ఎనిమిది వేల కణాలను నిశితంగా పరిశీలించారు.

ఒక్కో కణంలోని జన్యుపరమైన చర్యలను ప్రత్యేక టెక్నాలజీ ద్వారా పరిశీలించినప్పుడు. వయసు ఎక్కువతున్నప్పటికీ కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుక కణాల్లో మార్పులు పెద్దగా చోటుచేసుకోలేదు. అంతేకాదు. వీటి కణజాలం, కణాలు కూడా యుక్తవయసులో ఉండే ఎలుకలను పోలి ఉన్నాయి.

కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుకల్లో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా మంట/వాపు, కొవ్వులు జీర్ణ ప్రక్రియలకు సంబంధించిన జన్యువులపై కూడా సానుకూల ప్రభావం కనిపించింది.

ఆహారంకారణంగా వైబీఎక్స్‌1అనే ట్రాన్స్‌ క్రిప్షన్‌ ఫ్యాక్టర్‌ 23 రకాల మార్పులను నియంత్రిం చగలిగిందని
తెలిసింది. ఈ పరిశోధన ద్వారా తెలుసుకున్ని విషయాలను కొత్త కొత్త మందును
తయారు చేసేందుకు వినియోగించనున్నట్లు బెహమోంటే తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/