కాస్త కొత్తగా కనిపించాలంటే..

కొత్తగా ఎన్ని రకాల దుస్తులు కొన్నా కొన్ని సార్లు మన చాయిసే మనకు బోర్‌గా అనిపిస్తుంది. అలాగని ప్రతిసారి కొత్తవి కొనలేము. అలాగని కొన్నవాటిని పక్కన పెట్టేయలేము. అలా కాకుడా ఒకే రకం దుస్తులైనప్పటికీ ఆహార్యంలో చిన్న మార్పు చేసుకోవాలి. కాస్త కొత్తగా కనిపించాలనుకున్నప్పుడు మనం వేసుకునే దుస్తుల విషయంలో చిన్న ప్రయోగాలు చేయాలి. జీన్స్‌ ఎప్పటికీ ట్రెండే. కానీ ఎప్పుడూ ఒకే తరహాలో ఎంచుకోవడం వల్ల కొత్తదనం కనిపించదు. ఎప్పుడూ ఎంచుకునే లో వెయిస్టెడ్‌ స్కీన్నీ, స్ట్రెయిట్‌ కట్‌ తరహా జీన్స్‌కి బదులుగా ఈసారి హైవెయిస్టెడ్‌ తరహాది ఎంచుకోండి. భిన్నంగా కనిపిస్తారు. ఎప్పుడూ ఎత్తుమడమల చెప్పులే కాదు అప్పుడప్పుడూ శాండిల్స్‌లోని ఫ్లిప్‌ఫ్లాప్‌ తరహాలో మరెన్నో ప్రత్యేక డిజైన్లు ఉన్నాయి. వాటిని ప్రయత్నించండి. అవి కొత్తగా కనిపించేలా చేస్తాయి. ఈ రోజుల్లో ఎప్పుడూ జీన్స్‌, కుర్తీయే కాదు చిన్న చిన్న పార్టీలకు కొత్తగా కనిపించేందుకు

క్రాప్‌టాప్‌లు, పలాజోలు, మ్యాక్సీలు వంటివి ప్రయత్నించడి. సందర్భాన్ని బట్టి వాటిల్లో నచ్చినవాటిని ఎంచుకోండి. అవి ఖచ్చితంగా కొత్తగా కనిపించేలా చేస్తాయి. నగల విషయంలోను మార్పులు చేసుకోవాలి. టెర్రకోట, ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ వంటి రకాలెన్నో తాజాగా సందడి చేస్తున్నాయి. వాటిని ఎంచుకుని చూడండి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/