ఎముకల బలాన్ని పెంచడానికి..

ఆహారం-ఆరోగ్యం

To increase bone strength
To increase bone strength

పాలు తాగడం ద్వారానే ఎముకలు బలపడతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎముకల బలాన్ని పెంచడానికి టమాటో రసం కూడా దోహదపడుతుందని కెనెడియన్‌ పరిశోధనల్లో తేలింది. దీనిలో ఉండే లైకోపిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల ఎముకలు బలపడతాయని తెలిసింది.

రుతుక్రమం ఆగిపోయిన (మెనోపాజ్‌ వచ్చిన) కొందరు మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో టమాటో రసం వల్ల ఎముకలు బలపడతాయని నిరూపితమైంది. అయితే తాజా టమాట జ్యూస్‌ వల్లనే ఈ ఫలితం ఉంటుందని, దాన్ని సాస్‌, కెచప్‌ రూపంలో నిల్వ ఉంచడం వల్ల లైకోపిన్‌ తగ్గుతుందని నిరూపితమైంది.

ఈ లైకోపిన్‌ అన్నది ఎర్ర రంగులో ఉండే కేరట్‌, పసుపుపచ్చ రంగులో ఉండే బొప్పాయి, పింక్‌ రంగులో ఉండే ద్రాక్షపక్ష లోనూ ఉంటాయని తెలిసింది. ఇకపై ఎముకలబలానికి టమాటాజ్యూస్‌నూ ఒక మార్గంగా మీరు ప్రయత్నించ వచ్చు.

ఒకవేళ టమాటాను జ్యూస్‌గా తీసుకో వడం ఇష్టం లేకపోతే రుచి కరంగా ఉండే కేరట్‌, బొప్పాయి, ద్రాక్షలనూ ట్రై చేయ వచ్చు. కానీ. వాటన్నిం టిలో కంటే టమాటా జ్యూస్‌ లోనే లైకోపిన్‌ ఎక్కువ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/