ఫర్నిచర్‌ పాడవకుండా ఉండాలంటే

ఇంటి సామానులు-జాగ్రత్తలు

furniture
furniture

వర్షం పడుతుంటే బయటే కాదు ఇంట్లో కూడా తేమ ఎక్కువవుతుంది. తేమ వల్ల ఇంట్లో ఫర్నిచర్‌ పాడవడమ కాక ఇంట్లో ముతక వాసన వస్తుంది.

క్రిమికీటకాలు కూడా చేరతాయి. ఈ సీజన్‌లో ఇలాంటి ఇబ్బందులు తప్పాలంటే తడిసిన షూలు, చెప్పులను ఇంటి బయటే ఉంచాలి.

ఇంటిలోపలి గోడలు లేదా డామా మీద పగుళ్లు ఉంటే వాన నీరు ఇంటిలోపలికి వస్తుంది.

దాంతో గోడలు తేమను పీల్చుకుని వాటి మీద ఫంగస్‌ పెరుగుతుంది. ఇల్లంతా ముతక వాసన వస్తుంది.

కాబట్టి పగుళ్లను క్రాక్‌ఫిల్‌ పుట్టీతో మూసేయాలి. పగిలిన టైల్స్‌ ఉంటే వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి.

గోడల మీది తేమను పీల్చుకుని కలప ఫర్నీచర్‌ దెబ్బతింటుంది. అందుకే గోడలకు కొద్దిదూరంలో వాటిని ఉంచాలి.

పొడివస్త్రంతో కలప ఫర్నిచర్‌ను తుడవాటి. కలపతో చేసిన కప్‌బోర్డుల్లో సిలికా జెల్‌ పొడి, వేప ఆకులు నాఫ్తలీన్‌ గోళీలను ఉంచితే తేమ, చెడు వాసనను పీల్చుకుంటాయి.

నేలమీద పరిచిన కార్పెట్లు దుమ్ముధూలిని తొందరగా పీల్చుకుంటాయి.

ఈ సీజన్‌లో తేమ వల్ల వాటి మీద బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరిగే అవకాశముంది. అందుచేత కార్పెట్లు ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.

వెదురుతో చేసిన చాపలను కార్పెట్‌గా ఉపయోగిస్తే ఏ సమస్య ఉండదు.

కిటికీలు, తలుపులకు లేతరంగుల్లో ఉండే దళసరి పరదాలను అమర్చాలి. తద్వారా ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి.

అలాగే కాటన్‌ బెడ్‌షీట్స్‌, పరదాలు, సోఫా కవర్లను వారానికి ఒకసారి మార్చాలి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/