లోక్‌సభను వాకౌట్‌ చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌

Sudip Bandyopadhyay
Sudip Bandyopadhyay

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ ఈ రోజు లోక్‌సభలో మాట్లాడుతు జమ్ము కశ్మీర్‌ను రాష్ట్రంగానే కొనసాగిస్తే వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. ఆర్టిక్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన వంటి నిర్ణయాలు తీసుకొనే ముందు అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఉంటే బాగుండేదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కశ్మీర్‌ను మరింత అస్థిరతలోకి నెడుతుందని అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతిలో మనం ఉన్నామని, ప్రతి ఒక్కరూ కశ్మీర్‌తో అనుబంధం కలిగి ఉండాలని కోరుకుంటారని వివరించారు.
అంతేకాకా జమ్ము కశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు తాము మద్దతు ఇవ్వడం కానీ, వ్యతిరేకించడం గానీ చేయబోమని ఈ మేరకు లోక్‌సభ నుంచి ఆ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/