సుదీర్ఘ విరామం తర్వాత సానియా విజయం
అదరగొట్టి టైటిల్ సాధించిన సానియా మిర్జా

హోబర్ట్: టెన్నీస్ కోర్ట్లో రీఎంట్రీ ఇచ్చిన భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జా తనలో చావ తగ్గలేదని చాటుకుంది. తొలి అంతర్జాతీయ టైటిల్ని సానియా గెలుచుకుంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ మహిళల డబుల్స్ టైటిల్ని సానియా జోడి సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సానియా మిర్జా నదియా కిచెనోక్(ఉక్రెయిన్) జోడి రెండో సీడ్ జాంగ్ షూపెంగ్ షూ(చైనా) జోడిని 64, 64 వరుస సెట్లలో మట్టికరిపించి టైటిల్ కైవసం చేసుకుంది. చైనా జోడి ఏ దశలోనూ సానియా జోడికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. శుక్రవారంనాటి సెమీ ఫైనల్ మ్యాచ్లో సానియా జోడి 76, 62 తేడాతో మేరీ బౌచ్కోవా (చెక్ రిపబ్లిక్)జిదాన్సెక్ (స్లొవేనియా)లపై గెలిచారు. చివరగా 2017లో చైనా ఓపన్లో 33 ఏళ్ల సానియా మిర్జా ఆడింది.
తాజా చెలి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/women/