టైటానిక్‌ @ 25 ఇయర్స్

టైటానిక్‌ చిత్రం 25 ఏళ్లు పూర్తీ చేసుకుంది. 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో..ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఈ సినిమా టైటానిక్ నౌక ప్రమాద నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కథలో హీరో – హీరోయిన్ లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నౌక మొట్టమొదటి ప్రయాణంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి చివరికి ప్రమాదం ద్వారా ఇద్దరూ ఎలా విడిపోయారన్నది ఈ చిత్ర కథాంశం.

1912 ఏప్రిల్‌ 15న 2 వేలకు పైగా ప్రయాణికులతో వెళుతున్న టైటానిక్‌ షిప్‌ ప్రమాదానికి గురైంది. ఓ భారీ మంచు గడ్డను ఢీకొట్టింది. రెండుగా చీలి నార్త్‌ అట్లాంటిక్‌ మహా సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్‌ ప్రమాదంలో 1500 మంది మృత్యువాత పడ్డారు. టైటానిక్‌ సముద్రంలో మునిగిపోయినా.. దాని గురించి ప్రజలు మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే మునిగిపోయిన తర్వాతే దానికి గుర్తింపు వచ్చింది. 1990 లలో జేమ్స్‌ క్యామెరూన్‌ టైటానిక్‌ విషాదాంతంలో ఓ సినిమా తీయాలనుకున్నారు.

1997లో లియోనార్డో డెకాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ జంటగా ‘టైటానిక్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విషాదకరమైన ప్రేమ కథగా ఆ సమయంలో ఎన్నో రికార్డులను సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌గా నిలిచింది. దర్శకుడు జేమ్స్‌ క్యామెరూన్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక, ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా టీం ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 1986ల నాటి టైటానిక్‌ షిప్‌ వీడియోను విడుదల చేసింది. ఓ బృందం సముద్రం అడుగులోకి వెళ్లి.. టైటానిక్‌ ఓడను వీడియో తీసింది.