లక్షకోట్ల టర్నోవర్‌కు ‘టైటాన్‌!

ముంబై : ప్రముఖ గడియారాలు, జ్యుయెల్లరీ సంస్థ టైటాన్‌ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్ల మార్కుకు చేరనుంది. ఈ కంపెనీ షేరు గత ట్రేడింగ్‌ సెషన్‌ రోజున రూ.1113ను అధిగమించింది. తర్వాతి ట్రేడింగ్‌ సెషన్‌లో టైటాన్‌ ఈ క్లబ్‌లోకి చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు టైటాన్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.97212కోట్లు. గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఇది రూ.98,014కోట్ల వరకూ చేరింది. ప్రస్తుతం మన దేశంలో ట్రిలియన్‌ మార్క్‌ క్లబ్‌లోకి చేరిన లిస్టెడ్‌ సంస్థలు 27 మాత్రమే ఉన్నాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సంస్థ 41.6శాతం వృద్ధిని నమోదు చేయడంతో రూ.416కోట్లకు చేరింది. జ్యుయెల్లరీ సెగ్మెంట్‌ పనితీరు మెరుగ్గా ఉండడమే ఇందుకు కారణం. ఈ సెగ్మెంట్‌ ఏకంగా 37 శాతం వృద్ధిని నమోదు చేసింది. టైటాన్‌సంస్థ తీసుకున్న రుణాలను క్రిసిల్‌ సంస్థ పాజిటివ్‌ ఔట్‌లుక్‌ ఇచ్చింది. సంస్థ ఇకపై కూడా మెరుగైన పనితీరును కనబరచవచ్చని క్రిసిల్‌ విశ్లేషిస్తోంది. గత రెండేళ్లుగా టైటాన్‌ జ్యుయెల్లరీ సెగ్మెంట్లో స్టోర్లను పెంచుకుంటూ వస్తోంది. ఏటా 10నుంచి 20 స్టోర్లకు బదులు 30నుంచి 40 స్టోర్ల చొప్పున విస్తరిస్తోంది. ఇప్పటికే 267తనిష్క్‌, 25 మియా, 45 కారెట్‌లేన్‌ స్టోర్లను టైటాన్‌ నిర్వహిస్తోంది.

https://www.vaartha.com/news/business/తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.