5వ పాశురం: తిరుప్పావై –

ఆధ్యాత్మిక చింతన

మాయవై మన్ను వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్‌ యమునై త్తుఱైవన్నె
ఆయర్‌ కులత్తినిల్‌ తోనుమ్‌ మణివిళక్కై
తాయై క్కుడల్‌ విళక్కమ్‌ శెయెద్ దామోదరనై,
తూయోమాయ్ వన్దునామ్‌ తూమలర్‌ తూవిత్తొళుదు
వాయినాల్‌ పాడి మనత్తినాల్‌ శిన్దిక్క
పోయ పిళైయుమ్‌ పుకుదరువా నిన్జనవుమ్
తీయినిల్‌ తూశాగుమ్‌ శెప్పేలో రెమ్బావాయ్
5వపాట
గొల్ల గోవ్ఞలు వచ్చు, ఆ లింగనమునిచ్చు
యమునపై విహరించు, వేణుమాధవ్ఞని
దాసులపై దయజూపు దామోదరుని
మాత కొంగున మణిదీపమైనవాని
మధుర నగరికి రాజై వెలుగు వాని
మంచి మనసుతో వచ్చి, మంచి పుష్పాలు తెచ్చి
తనువ్ఞ వాక్కును కలిపి మదిలోన హరిని నిలిపి
పరమ పురుషుని పదములు పాడుచుండ
పూర్వజన్మల మన పాప పట్టికంత
నిప్పు ముట్టిన పత్తివలె గప్పునారు. –
భావం: మధుర ప్రజలు భగవంతుని సదా సేవించువారు. మంచి స్వచ్ఛమైన నీటితో నిండుగ ప్రవహిస్తున్న యమునా నది ఒడ్డున ఉండువాడు, ఆశ్చర్యము గొలుపువాడు, యశోదాదేవి ఒడిలో పెరిగిన, మణిదీపము వంటివాడైన దామోదరుడు, పరిశుభ్రంగా తయారై పుష్పములు అర్పించుదాం. సేవించుదాం. నోరారపాడుదాం, మనసారా ధ్యానం చేద్దాం. అగ్నిచే కాల్చబడిన దూదివలె గతజన్మలో చేసిన పాపములు వచ్చే జన్మలో చేయు పాపములు నశిస్తాయి. అందుకే ఆ దైవమును కీర్తించుదాం.

ఫలం: పాప ప్రక్షాళన కొరకు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/