తిరుపతి రుయాలో దారుణం :11 మంది కరోనా రోగులు మృతి

కోవిడ్ విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం

corona patients dead
corona patients dead

Tirupati: తిరుపతి రుయా ఆస్పత్రిలో కోవిడ్ విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో కనీసం 11 మంది కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా తెలిసింది. . ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు ప్రెజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో ఐసీయూలోని బాధితులు ఊపిరాడక తల్లడిల్లిపోయారు. .ఆక్సిజన్‌ ట్యాంకు ఖాళీ కావడంతో 5 నిమిషాల పాటు సరఫరా నిలిచిపోయిందని, శ్రీపెరంబూర్‌ నుంచి ఆక్సిజన్‌ రవాణా ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకతో సరఫరాను పునరుద్ధరించి బాధితులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/