టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ

వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన ప్రభుత్వం

ttd eo anil kumar singhal

అమరావతి: టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అదనపు ఎగ్జిక్యూటివ్ గా ఉన్న ధర్మారెడ్డిని, కొత్త ఈఓ నియామకం జరిగే వరకూ ఇన్ చార్జ్ ఈఓగా నియమిస్తున్నట్టు వెల్లడించింది. అనిల్ కుమార్ ను వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రెటరీగా నియమిస్తున్నట్టు కూడా పేర్కొంది. కాగా, టీటీడీకి ఈఓగా రాకముందు అనిల్ కుమార్ ఢిల్లీలో ఏపి రెసిడెంట్ కమిషనర్ గా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన టీటీడీ ఈఓగా 2017లో బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల కాలపరిమితికి ఆయన బాధ్యతలు స్వీకరించగా, 2019లో మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. దాదాపు మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటు టీటీడీ ఈఓగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, సామాన్యులకు స్వామివారి దర్శనాన్ని మరింత దగ్గర చేస్తూ, కీలక సంస్కరణలను అమలు చేశారు. క్యూలైన్లలో రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా టైమ్ స్లాట్ టోకెన్ విధానానికి రూపకల్పన చేసింది ఆయనే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/