తిరుమల శ్రీవారి హుండీకి శనివారం ఒక్కరోజే రూ.2.25 కోట్ల ఆదాయం..

కరోనా ఉదృతి నేపథ్యంలో తిరుమల శ్రీవారి హుండీకి ఆదాయం బాగా తగ్గింది. నిత్యం కోట్లలో వచ్చే ఆదాయం..కరోనా టైం లో వేలల్లో వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుముఖం పట్టడం తో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

శనివారం ఒక్క రోజే శ్రీవారి హుండీకి భారీ ఆదాయం వచ్చినట్లు టిటిటి అధికారులు తెలిపారు. శనివారం ఒక్క రోజే రూ.2.25 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించారు. అలాగే శనివారం 24,568 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 13,088 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ప్రకటన లో తెలియజేసారు. ఈరోజు ఆదివారం కూడా భక్తుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలిపారు. ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్, జనసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బస్టర్ 22వ రాజు కమల్ చంద్ర భంజ్ దియోతో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.