శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం అనుమతి

ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనం

Tirumala Srivari Temple
Tirumala Srivari Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనం చేసుకోవాలని సూచించింది. శ్రీవారి దర్శనాలకు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ బోర్డు ఈవో అనిల్ సింఘాల్ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, మార్గదర్శకాలు వెల్లడికానున్నాయి. భక్తులను అనుమతించే ముందు టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో స్వామి వారి దర్శన ట్రయల్ నిర్వహించాలని సూచించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/