తిరుమల బ్రహ్మోత్సవాలు.. తొమ్మిది రోజులు ప్రత్యేక దర్శనాల రద్దు

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

tirumala-brahmotsavalu

తిరుమలః తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 27న ధ్వజారోహణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు.

ఇక అక్టోబర్ 1న గరుడవాహన సేవ ఉంటుందని, 5న చక్రస్నానం నిర్వహిస్తారని చెప్పారు. అక్టోబర్ 1న గరుడసేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలకు అనుమతి లేదని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారికి వాహన సేవలను నిర్వహిస్తామని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/