తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TIRUMALA TEMPLE
TIRUMALA TEMPLE

తిరుమల: తిరుమల కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే ఈరోజు విడుదల చేసింది. జూన్‌ నెలకు సంబందించిన 63,804 ఆర్జిత సేవా టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో 10,129 సేవా టికెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానానికి కేటాయించారు. డిప్‌ పద్ధతిలో సుప్రభాత సేవకు 7,924, తోమాల సేవ 120, అర్చన 120, అష్టదళ పద్మారాధన సేవ 240, నిజ పాదదర్శనానికి 1,725 టికెట్లు కేటాయించారు.సాధారణ పద్ధతిలో 53,675 టికెట్లను కేటాయించారు. అందులో విశేష పూజకు వెయ్యి, కల్యాణోత్సవం 13,775, ఊంజల్‌ సేవ 4,350, వసంతోత్సవం 7,700, సహస్ర దీపాలంకరణ 18,600, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 8,250 టికెట్లు అందుబాటులో ఉంచారు. డిప్‌ పద్ధతిలో ఉన్న టికెట్ల కోసం నమోదుకు నాలుగు రోజుల పాటు అవకాశం కల్పించారు. నమోదు చేసుకున్న వారికి డిప్‌ విధానం ద్వారా ఆర్జిత సేవా టికెట్లను కేటాయిస్తారు.