శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala
Tirumala

తిరుమల: టిటిడి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసింది. అక్టోబరుకు సంబంధించి 55,355 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 9,305 సేవా టికెట్లు, సుప్రభాత సేవ కోసం 7,180, తోమాల 110, అర్చన 110, అష్టదళ పాద పద్మారాధన 180, నిజ పాద దర్శనం కోసం 1725 టికెట్లను విడుదల చేసింది. కరెంటు బుకింగ్‌ కింద 46,050 ఆర్జిత సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది. విశేషపూజ 1,500, కల్యాణోత్సవం 10,450, ఊంజల్‌ సేవ 3,300, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,050, వసంతోత్సవం 11550, సహస్ర దీపాలంకరణ కోసం 13,200 టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.
టిక్కెట్ల విడుదల సమయం నుంచి నాలుగు రోజులపాటు నమోదు అవకాశం కల్పించింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/