ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తిరథ్ సింగ్ రావత్

అధికారిక ప్ర‌క‌ట‌న

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ (60) తన పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఉత్త‌రాఖండ్ కొత్త సీఎంగా తీర‌త్ సింగ్ రావ‌త్ నియ‌మితుల‌య్యారు. ఆయ‌న ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న త్రివేంద్ర సింగ్ రావ‌త్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇవాళ డెహ్రాడూన్‌లోని బీజేపీ పార్టీ ఆఫీసులో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. లెజిస్లేచ‌ర్ మీటింగ్‌లో ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ పాల‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.


కాగా, సీఎం పదవి రేసులో ప‌లువురి పేర్లు విన‌ప‌డ్డాయి. ఇప్ప‌టికే కేంద్ర, రాష్ట్ర మంత్రుల హోదాలో ఉన్న నేతల పేర్లను బీజేపీ పరిశీలించింది. చివ‌ర‌కు తీర‌త్ సింగ్ రావ‌త్ పేరును ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/