టిప్పుసుల్తాన్‌ జ్ఞాపకాలను చెరిపేస్తాం: యెడియూరప్ప

yeddyurappa
yeddyurappa

బెంగళూరు: టిప్పుసుల్తాన్‌ జ్ఞాపకాలను చెరిపేస్తామని, పాఠ్యపుస్తకాల్లోంచి కూడా వాటిని తొలగిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారు. తాను టిప్పు సుల్తాన్‌కు బద్ధ వ్యతిరేకినని సిఎం బిఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్‌ స్వాతంత్య్ర సమరయోధుడు కాదని, ఆయన జయంతినే కాదు, అసలు ఆయన జ్ఞాపకాలే లేకుండా చేస్తామని యెడియూరప్ప తేల్చిచెప్పారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతియేడు నవంబర్‌ 20న టిప్పు సుల్తాన్‌ జయంతిని అధికారికంగా నిర్వహిస్తు వస్తోంది. ఆ విధానానికి స్వస్తి పలుకుతామని యడియూరప్ప చెప్పారు. టిప్పు సుల్తాన్‌ జయంతిని నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై అధ్యయనం చేసేందుకు కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్‌ ఇటీవలే ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ మరో వారం రోజుల్లో దీనిపై నివేదికను అందించాల్సి ఉంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఈ విధంగా స్పందించారు. టిప్పుసుల్తాన్‌కు తాను బద్ధ వ్యతిరేకినని, ఆయన వర్ధంతిని నిర్వహించడానికి కూడా తాను ఇష్టపడనన్నారు. మాధ్యమిక పాఠ్యపుస్తకాల్లోంచి కూడా ఆయనపై రూపొందించిన బోధనాంశాలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా తెలంగాణ కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/