ఇలా చేసి చూడండి

Tips

మధుమేహ వ్యాధులున్నవారు కాకరకాయ కూరను ఎక్కువగా వాడితే మధుమేహవ్యాధి కొంత తగ్గుతుంది.

కరెంటు పోయినప్పుడు ఎక్కువ వెలుగు కావాలం టే వెడల్పయిన గిన్నెలో కొవ్వొత్తిని అంటించి నిల బెట్టిన తర్వాత నీళ్లు పోయండి. ఆ గిన్నెను అద్దం దగ్గర ఉంచితే వెలుగు బాగా వస్తుంది.

పాతబ్రెడ్‌ పసందుగా ఉండేటట్లు చేసేటందుకు పాలతో దాన్ని తుడవండి. పదినిమిషాల సేపు ఒకమితమైన వేడిగల ఓవెన్‌పై పెట్టండి. పైపొర పెళపెళలాడుతుంది. రుచిగాఉంటుంది.

వెన్న కాచేటప్పుడు తాజా బంగాళాదుంప ముక్క కొంచెం కరివేపాకు వేస్తే నెయ్యి సువా సనాభరితంగా ఉంటుంది.

భోజనం చేసిన తర్వాత ఒక పచ్చి క్యారెట్‌ తినటం వలన నోటి నుంచి దుర్వాసన రాదు. దంతక్షయం చిగుళ్లవాపు వంటి రోగాల నుండి రక్షిస్తుంది.

మేకప్‌ బ్రష్‌లు మెత్తగా ఉండాలంటే తరచు వాటిని హెయిర్‌కండీషనర్‌తో కడగాలి.

ఎండిపోయి గడ్డకట్టిన బూట్‌పాలిష్‌లో కొన్నిచుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ను కలిపితే
పాలిష్‌ మామూలుగా తయారవుతుంది.

నిమ్మ, దబ్బ, మామిడి లాంటి పుల్లటి కాయలను తరిగితే కత్తిపీట పదునెక్కుతుంది.

ఖాళీ అయిన టానిక్‌ సీసాలలో టానిక్‌ వాసన పోవాలంటే యాలుక తొక్కలను అందులో వేసి రెండు రోజులు ఉంచి తరువాత కడగాలి.

నెత్తురు మరకలు పడిన దుస్తులను ఉప్పు నీటిలో నానబెట్టి ఆ తరువాత సబ్బుతో ఉతికితే మరకలు పోతాయి. అలాగే సిరామరకలకు కొద్దిగా కిరసనాయిల్‌ వేసి నానబెట్టి అరగంట తర్వాత ఉతికితే పోతాయి. నెత్తురు మరకలు పడిన దుస్తులను ఉప్పునీటిలో నానబెట్టి ఆ తరువాత సబ్బుతో ఉడికితే నెత్తురు మరకలుపోతాయి.