భావాలు పంచుకునే సమయం

జీవన వికాసం

Time to share feelings
Time to share feelings

బహుశా ఇంతటి సంక్షోభం ఇదివరకు మనము చూడకపోవచ్చు. ఇలా ఇంటిపట్టున ఇంత కాలం తప్పనిసరిగా ఉండటమన్నది ఎవరూ ఊహించకపోవచ్చు.

కరోనా మహమ్మారితో ఇంటికే పరిమితమయ్యాం. మనల్ని మనం కాపాడుకోవాల్సిందే. లాక్‌డౌన్‌ ముగిసే వరకు ఇదే పరిస్థితి ఉండేలా ఉంది.

ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండాలంటే ఎవరికైనా విసుగ్గా ఉంటుంది.భార్యాభర్తలు మాత్రమే ఉన్న ఇంట్లో అయితే పని చేసుకున్నంత సేపు పనిమీద ఆ తరువాత బోర్‌ కొడుతుంది.

భాగస్వామితో కలిసి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు చేస్తే మంచిది. ఇద్దరి మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది.

సంబంధాన్ని మరింత బలంగా మలుచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం.

ఇంత సమయం ఇంకెప్పుడు వస్తుందో మరి! కరోనా వల్ల అందరూ చాలా నిఉత్సాహంలో ఉన్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి.

అటువంటి పరిస్థితిలో భార్యభర్తలు ఒకరి పట్ల ఒకరు ఎంత ఆదరాభిమానాలతో ఉంటున్నారో నిర్ధారించుకోవాలి.

ఇలాంటి పరిస్థితిలో మీరు మీ భాగస్వామితో కలిసి ఉన్నారని గుర్తు చేసుకోవాలి.

వైఫ్‌ అండ్‌ హజ్బెండ్‌ ఎంత కాలం కలిసి ఉన్నా వారి మధ్య ప్రేమ, అనురాగం ఉంటే కాలమే తెలియదు.

అలా ప్రియమైన వారు మీతో ఉండగా సమస్యలను సులభంగా అధిగమించవచ్చని భావించాలి.

పెళ్లయిన కొంతకాలానికి ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది.

అయితే ఉద్యోగరీత్యా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇరువురి మద్య సాన్నిహిత్యం పెంపొందించుకోవడానికి అవకాశం తక్కువ. ఇప్పుడా అవకాశం దొరికినట్లుగా భావించాలి.

ఆఫీస్‌ హడావుడిలో పడి కొన్ని కొన్ని సంతోషాలను దూరం చేసుకుని ఉంటారు.

ఇప్పుడు ఆ సంతోషాలను గుర్తు చేసుకుని ఆస్వాదించవచ్చు. ఈ సమయంలో ఇద్దరూ కలిసి పనిచేసుకోవడం.

ఇంటి పనుల్లో భార్యకు సహాయంగా ఉంటే పని చేస్తున్నా అలసటగా ఉండదు. మాటలతో భాగస్వామిని మరింత ఉత్సాహపరుస్తుండాలి. పనిలో చేదోదువాదోడుగా ఉంటే ఇద్దరి మధ్య ప్రేమా ఆప్యాయతలు మరింతగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే కొంత ఒత్తిడిగా అనిపిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో మీరు సురక్షితంగా ఉండటమే మేలు అని భావించాలి. ఇందుకు మరో మార్గం కూడా లేదు. నచ్చిన పుస్తకాలు చదువుకోవడం, ఒకరి భావాలు ఒకరు పంచుకోవడంతో ఒత్తిడి నుండి దూరం కావచ్చు.

ఇలా కూడా ఎక్కువ రోజులు ఉండలేక కొంత విసుగ్గా కూడా ఉంటుంది. అటువంటప్పుడు కలిసి సినిమాలు చూడడం మంచిది.

ఇష్టమైన వంటలు తయారు చేసుకోవాలి. అలాగే ఇండోర్‌ గేమ్స్‌ వంటివి ఆడుకోవాలి. టెక్నాలజీ ప్రతి వారికి అందుబాటులోకి వచ్చింది.

ఇది ఒక చక్కని అవకాశంగా భావించి యూట్యూబ్‌ సహాయంతో నచ్చినవి నేర్చుకోవచ్చు. ఇద్దరూ కలిసి గడిపిన మధురక్షణాలను గుర్తు చేసుకోవాలి.

పాత ఫొటోలు, పెళ్లి వీడియోలను వేసుకుని చూడాలి. అలా చేస్తే సమయాన్ని ఆస్వాదించడంతో పాటు ఆ క్షణానలు మరింతగా ఆనందించవచ్చు.

ఇది ఇద్దరిని మరింత ఉత్సాహంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉన్నప్పటికీ వైరస్‌ సోకకుండా వ్యాయామం కూడా సహాయపడుతుంది.

కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేస్తుండాలి.

వ్యాయామం ద్వారా శరీరం దృఢంగా మారి ప్రతికూల ఆలోచనలు లేకుండా చేసుకోవచ్చు. దాంతో ఇద్దరూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండవచ్చు. అనవసరంగా బయటకు వెళ్లవద్దు.

బయటకు వెళితే వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉండడం వల్ల మీకే కాదు మీ జీవిత భాగస్వామికి కూడా మంచిది.

మీరు మీ జీవిత భాగస్వామిని ఎంతటి శ్రద్ధ చూపిస్తున్నారో తెలుస్తుంది. భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తిగా ఉండాలి.

ఏం చేసినా ఒకరికొకరు సహకరించుకోవాలి. ప్రతి పనిలో ఇద్దరు భాగస్వాములుగా ఉండాలి.

ఈ విధంగా భార్యభర్తల మధ్య అనుబంధం మరింత దృఢంగా ఉండి.

ఎలాంటి క్లిష్టసమయాల్లో కూడా సంబంధాన్ని సజీవంగా ఉంచుకోలుగుతారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/