టైం మేనేజ్‌మెంట్‌

సమయానికి ఉన్న విలువ ఏమిటి? మీ సమయాన్ని మీరు ఎంత గొప్పగా, ఎంత ఎఫెక్టివ్‌గా ఉపయోగించుకునే వీలుంది? మీకున్న సయయాన్ని బట్టి, మీ జీవిత లక్ష్యాన్ని, మీ జీవిత లక్ష్యాన్నిబట్టి మీకున్న సమయాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం ఎలా?

గోల్‌ సెట్టింగ్‌ పర్సనల్‌ ప్లానింగ్‌, సంక్లిష్టమైన సందర్భాలలో పథకం ప్రకారం టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చేయడం ఎలా? వెయిట్‌ చేసే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవటంలో మెళకువ లేమిటో? ఫాస్ట్‌ రీడింగ్‌ ద్వారా సమయాన్ని సేవ్‌ చేసుకోవటం ఎలా? వృధాగా సమయాన్ని గడపకుండా ఎలా జాగ్రత్తపడాలి? అనే అంశాల గురించి తెలుసుకుందాం.

జీవితమనే పరుగు పందెంలో అందరికన్నా ముందుండాలన్న తపన ఉన్న వారే ఓ గుర్తింపు తెచ్చుకోగల్గుతారు. ఇంత మందితో పోటీపడి నెంబర్‌వన్‌గా ఉండగలమా అన్న సందేహంతో కనీసం ప్రయత్నం కూడా చేయనివారు ‘బావిలో కప్పల్లా అలానే ఉండిపోతారు. ఎదుగూ బొదుగూ లేకుండా, జీవితమంటే బోర్‌గా ఉందని భావిస్తారు. ప్రతిక్షణం శతృవుల్ని చేధించుకుంటూ ముంద డుగు వేయడమే రణ నీతి. అలానే జీవితంలో అందర్నీ దాటుకుంటూ ముంద డుగు వేసి నంబర్‌వన్‌గా నిలవ టమే జీవిత పరమావధి కావాలి. టైం మేనేజ్‌మెంట్‌ కొన్ని సూచనలు. టైమ్‌ మేనేజ్‌మెంట్‌తోనే పోటీని ఎదుర్కొని, నెగ్గగలరు.

  • నాకీటైంలేదు అని ఎవరయినా అంటే వారికి సమయాన్ని సద్వి నియోగం చేసుకోవటం ఏమాత్రం తెలియదని, టైం మేనేజ్‌ మెంట్‌ వారికసలు తెలియదని మనం గ్రహించాలి. చర్చిల్‌ రాజకీయ నాయకునిగా రాణిస్తూనే ఎన్నో గ్రంథాలు రాశారు. ఎన్నో పెయింటింగ్స్‌ వేసేవారు. గొప్పవాళు ‘టైంలేదు అనేమాటే వారి నోటి వెంటరాదు. టైంతో పరుగెత్తగల సమర్ధత వీరిలో ఉంది కనుక, చరిత్రలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోగలిగారు.
  • మీకు మీరు, 24 గంటల కాలంలో ఎంతకాలం పనిచేస్తున్నారో, ఎంత కాలాన్ని ఏఏ వ్యాపకాలకు ఉపయోగిస్తున్నారో, ఓ రెండు నెలలు డైరీ ఖచ్చితంగా నిమిషాలతో సహా వ్రాసుకోండి. రెండు నెలలు డైరీ ఖచ్చి తంగా నిమిషాలతో సహా వ్రాసుకోండి. రెండు నెలల తర్వాత,120 రోజుల్లో అంటే 2680 గంటల్లో ఏఏ పనికి ఎన్నిగంటలు ఉపయో గించాలో మొత్తం కూడండి సగటున లెక్కిస్తే, యావరేజిన 10 గంటలు మీరు మీ జీవన ప్రగతికోసం కష్టపడుతుంటే, ఆ సమయాన్ని పెంచుకుని 12, 14, 16 గంటలు చేసే ప్రయత్నం చేయండి. అంతకు తక్కువ కాలాన్ని మీ జీవితంకోసం మీరు వినియోగించుకుంటుంటే టైం మేనేజ్‌మెంట్‌ సూత్రాలు తప్పక నేర్చుకుని ఆచరణలో పెట్టండి.
  • ఒకరోజుకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ గంట గంటకూ ఏం చేయాలో ప్లాన్‌ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు మీరే విస్తుపోతారు. అయ్యో రోజులో నేనింత తక్కువకాలాన్ని వినియోగించుకుం టున్నానా అని దు:ఖపడతారు. కావాలంటే ప్రయత్నించి చూడండి.
    -ఏ రోజు కారోజు మీరు చేయవలసిన పనుల్లో మోస్ట్‌ ఇంపార్టెంట్‌, మోస్ట్‌ అర్జంట్‌, నార్మల్‌ ఇంపార్టెంట్‌, నార్మల్‌ అర్జంట్‌ ఇంపార్టెంట్‌ కానివి, అర్జంట్‌ నార్మల్‌ ఇంపార్టెంట్‌ పనులు చేయాలి. ఇంపార్టెంట్‌ కానివి, అర్జంట్‌లేనివి, అయిన పనుల్ని ఎంత వీలయితే అంత వాయిదా వేశారంటేే రోజులో మీకు టైం చాలా ఉంటుంది.
  • ఈ టైంను మరిన్ని పనులు చేయటానికి చేసేపనుల్ని మరింత క్వాలిటీతో చేయటానికి ప్రయత్నించండి. -టైమ్‌ను మీరు 100శాతం సద్వినియోగపరచుకోవాలంటే, ముందుగా మీరంటూ ఓ లక్ష్యాన్ని సెట్‌ చేసుకోవాలి. కనీసం ఈసారి పరీక్షలలో అయినా తొలి పది ర్యాంకులలో ఒకటి నాది కావాలి. అని విద్యార్ధి గోల్‌ సెట్‌ చేసుకోవాలి.
  • ఈ సంవత్సరం ఒక కోటి టర్నోవర్‌ చేయగలిగా, నెక్ట్స్‌ఇయర్‌ ఒకటిన్నర కోటి టర్నోవర్‌ చేయగలగాలి అని ఓ వ్యాపారి గోల్‌ సెట్‌ చేసుకోవాలి. మీదైన రం గంలో మిమ్ముల్ని మున్ముందుకు నడిపించే విధంగా ముందుగా ఓ గోల్‌సెట్‌ చేసుకోండి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/