జగన్ తో నాకున్న అనుబంధం చాలా బలమైనది

జగన్ నన్ను పక్కన పెట్టారని దుష్ప్రచారం చేస్తున్నారు..

Vijayasai Reddy
Vijayasai Reddy

విశాఖ: వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. సిఎం జగన్‌ తనను పక్కన పెట్టారని, విశాఖ ఇన్చార్జి పదవి నుంచి కూడా తొలగించనున్నారంటూ దుష్ప్రచారాలపై మండిపడ్డారు. ఇదంతా తప్పుడు ప్రచారం మాత్రమేనని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి, జగన్ తో తనకున్న అనుబంధం చాలా బలమైనదని… చివరి వరకు జగన్ తోనే ఉంటానని తెలిపారు. కాగా కేంద్ర పరిధిలోని ప్రభుత్వోద్యోగుల నియామకాలు సాధారణంగా రాష్ట్రపతి, గవర్నర్ పేరిట జరుగుతాయని… కానీ తనను తాను నియమించుకోవడం బహుశా నిమ్మగడ్డ రమేశ్ కే చెందిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారని… పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమవుతారని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/