టిక్‌టాక్‌ను విక్రయించేందుకు బైట్‌డ్యాన్స్‌ నిరాకరణ

మైక్రోసాఫ్ట్‌ అధికారిక ప్రకటన విడుదల

TikTok rejects Microsoft buyout offer

వాషింగ్టన్‌: టిక్ టాక్ తో మైక్రోసాఫ్ట్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. టిక్ టాక్ ను అమ్మేందుకు దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్ సిద్ధంగా లేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దేశ, పౌరుల భద్రత దృష్ట్యా తమ కొనుగోలు ప్రతిపాదనలు టిక్‌టాక్‌ వినియోదగారులకు శ్రేయోదాయకంగా ఉండేదని విశ్వాసం వ్యక్తం చేసింది. పౌరుల, దేశ, సైబర్‌ భద్రతలకు అనుగుణంగా నకిలీ సమాచారం అరికట్టేలా మార్పులు చేసేవాళ్లమని మైక్రోసాఫ్ట్‌ వివరించింది.

కాగా అమెరికాలోని టిక్ టాక్ కార్యకలాపాలను యూఎస్ సంస్థ సొంతం చేసుకుంటేనే దాన్ని కొనసాగిస్తామని… లేని పక్షంలో టిక్ టాక్ ను నిషేధిస్తామంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ సంస్థలు పోటీ పడ్డాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/