మళ్లీ వచ్చిన ‘టిక్‌టాక్‌’!

Tik Tok app
Tik Tok app

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ‘టిక్‌టాక్‌’ వీడియో యాప్‌ను ఇటివల భారత్‌లో గూగుల్‌, యాపిల్‌ యాప్‌స్టార్లలో నుండి తీసేయాలని ఆ సంస్థలకు కేంద్ర ప్రభ్తుత్వం లేఖలు రాసిన విషయ తెలిసిందే. అయితే ఈ యాప్‌ మళ్లీ భారత్‌లో గూగుల్‌, యాపిల్‌ యాప్‌ స్టార్లలో లభ్యమవుతుంది. ఆ యాప్‌పై ఉన్న నిషేధాన్ని కొన్ని షరతులతో మద్రాసు హైకోర్టు ఇటీవల ఎత్తేసింది. నిషేధం ఎత్తేసిన దాదాపు వారం రోజుల తర్వాత యాప్‌ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఖనిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. తమ క్రియేటివిటీని బయటపెడుతూ యూజర్లు టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. భారత యూజర్లకు మరింత మంచి సేవలను అందించడానికి మాకు వచ్చిన అవకాశం పట్ల గర్విస్తున్నాము. ఆ యాప్‌లో మరిన్ని సురక్షితమైన ఫీచర్లను తీసుకొస్తాం అని ఇటీవల టిక్‌టాక్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/