మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ మ‌రో వీడియో రిలీజ్‌

స‌త్యేంద‌ర్ జైన్‌ను క‌లిసిన జైల్ సూప‌రింటెండెంట్‌

tihar-jail-cell-superintendent-meets-minister-satyendar-jain

న్యూఢిల్లీః ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన మరో మ‌రో వీడియోను రిలీజ్ చేశారు. తీహార్ జైలులో ఉంటున్న ఆయ‌న.. త‌న సెల్‌లోనే అతిథుల్ని క‌లిశారు. జైన్‌ను క‌లిసిన వారిలో స‌స్పెండ్ అయిన‌ ఆ జైలు మాజీ సూప‌రింటెండెంట్‌ ఉన్నారు. సెప్టెంబ‌ర్ 12వ తేదీన రాత్రి 8 గంటల స‌మ‌యంలో జైన్ సెల్‌లో కొంద‌రు ముచ్చట్లు పెట్టారు. దానికి సంబంధించిన 10 నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు.

జైలు సూప‌రింటెండెంట్‌ అజిత్ కుమార్.. జైన్ సెల్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత .. అక్క‌డ ఉన్న కొంద‌రు బ‌య‌ట‌కు వెళ్లారు. ఇటీవ‌ల స‌త్యేంద‌ర్‌కు చెందిన వీడియోల‌ను వ‌రుస‌గా రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. సెల్‌లోనే ఆయ‌న మ‌సాజ్ చేయించుకున్నారు. ఇక రుచిక‌ర‌మైన భోజ‌నం, పండ్లు తీసుకుంటున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/