ఆదిలాబాద్‌లో రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం

Tiger in Adilabad roads
Tiger in Adilabad roads

ఆదిలాబాద్‌: అర్ధరాత్రి ఊహించని విధంగా ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం కావడంతో అతని పైప్రాణాలు పైనే పోయాయి. ఎలాగోలా బయటపడినా ఇప్పుడా సమాచారం చుట్టుపక్కల గ్రామాల నివాసితుల కంటిమీద కునుకు దూరం చేసింది. వివరాల్లోకి వెళితే…ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం నీరా గ్రామ శివారుకు చెందిన ఓ వ్యక్తి ప్రధాన రహదారిపై ఓ రాత్రి వస్తుండగా పులి ఎదురైంది. దీంతో ఆశ్చర్యపోయిన అతను దాని కంటపడకుండా అది వెళ్లడాన్ని సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం దీన్ని చుట్టు పక్కల వారికి చూపించడంతో కలకలానికి కారణమైంది. సమీపంలో లక్ష్మీపూర్‌ కాలువ ఉండడంతో నీళ్లు తాగడానికి పులి వచ్చి ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ రావడం… రావడం ఏదైనా ఊరిమీద పడితే పరిస్థితి ఏమిటని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రయితే కంటిమీదకు కునుకు రావడం లేదని వాపోతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/