ఒంగోలులో దారుణం.. తల్లీకూతళ్లను తగలబెట్టిన దుండగులు

fire
fire

ఒంగోలు: రోజురోజుకీ మృగాళ్ల ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయి. దిశ హత్యోదంతంతో యావత్‌ దేశమే ఉలిక్కిపడింది, అయినా ఎలాంటి భయం లేకుండా దారుణాలను చేస్తూనే ఉన్నారు. అలంటి ఘటనే తాజాగా ఏపిలోని ఒంగోలు పరిధిలో జరిగింది. ఒంగోలు సమీపంలో తల్లీకూతళ్లను రాళ్లతో కొట్టి హింసించడమే కాకుండా పెట్రోలు పోసి తగలబెట్టారు దుండగులు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఒంగోలు ప్రాంతంలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే ఆ తల్లీకూతుళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయి ఉన్నారు. పోలీసులు కథనం ప్రకారం.. మారెళ్లగుంటపాలెం, పేర్నమిట్ట మార్గంలో ఓ యువతి, ఓ పాప మంటల్లో తగలబడుతున్నట్లుగా నిన్న రాత్రి సమాచారం అందిందని తెలిపారు. మంటల్లో కాలిపోయిన వారిలో యువతికి ఓ 25 ఏళ్లు ఉంటుందని, ఆ చిన్న పాపకి ఏడాది వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం కిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/