గల్లా జయదేవ్‌తో సహా ముగ్గురికి టికెట్లు!

Jayadev Galla, tdp
Jayadev Galla, tdp


అమరావతి: రాబోవు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల ఎంపికలో టిడిపి అధినేత చంద్రబాబు తర్జనభర్జనలు పడుతున్నారు. గల్లా జయదేవ్‌తో పాటు మరో ఇద్దరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గుంటూరు పార్లమెంటు సీటు గల్లా జయదేవ్‌కేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే గుంటూరు జిల్లాలోని పొన్నూరు నుంచి ధూళిపాళ నరేంద్రకు, తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు టికెట్‌లను ఖరారు చేసినట్టు స్పష్టం చేశారు. గుంటూరు లోక్‌సభ స్థానంపై రెండు రోజులు సమీక్ష జరిపి ఈ నిర్ణయానికి వచ్చారు. టికెట్లు ఖరారైన అభ్యర్ధులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం మొదటుపెట్టి టిడిపిని తిరుగులేని మెజార్టీతో గెలిపించే బాధ్యత వారిదేనని సూచించారు. 2014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు, మంగళగిరి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టిడిపి సొంతం చేసుకోగా, ఈ దఫా ఎన్నికల్లో ఆ రెండింటిని కూడా గెలుచుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం.