కథువా అత్యాచారం కేసులో ముగ్గురికి యావజ్జీవం

ముగ్గురుకి యావజ్జీవం, లక్ష జరిమానా
మరో ముగ్గురు దోషులకు ఐదేళ్ల జైలు శిక్ష

kathua rape case
kathua rape case

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని కథువాలో గత ఏడాది జనవరిలో 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో ఇవాళ పఠాన్‌కోట్‌ ట్‌ కోర్టులో తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పూజారి సంజీవ్‌రామ్‌తో పాటు మరో ఇద్దరు దోషులు పర్వేశ్‌, దీపక్‌లకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా ఖరారు చేస్తూ తీర్పు నిచ్చింది. సాక్ష్యాలు చెరిపేసినందుకు తిలర్‌రాజ్‌, ఆనంద్‌దత్‌, సురేందర్‌కుమార్‌లను ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు వారికి ఐదు ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుని కుమరుడు విశాల్‌ను మాత్రం నిర్ధోషిగా ప్రకటించారు. ఈ ఆరుగురిపై సెక్షన 201, 120బి సెక్షన్ల కింద అరెస్టు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/