మరోసారి అమెరికన్ ఎంబసీపై రాకెట్ దాడి!

సమీపంలో పేలిన మూడు రాకెట్లు

Baghdad Rocket Attack
Baghdad Rocket Attack

బాగ్దాద్‌: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నడిబొడ్డున, హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. ఇక్కడికి సమీపంలో మూడు రాకెట్లు పడ్డాయని, ఆస్తినష్టం తప్ప, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇరాన్ నుంచి ఈ రాకెట్లు వచ్చినట్టు తెలుస్తుండగా, అవి లక్ష్యాన్ని తప్పాయని తెలుస్తోంది. ఇరాన్‌ సైనిక కమాండర్‌ సులేమానిని యూఎస్ దళాలు హతమార్చిన తరువాత, ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు యూఎస్ ఎంబసీపై క్షిపణి దాడులు జరుగగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ పై మరిన్ని దాడులను చేస్తామని హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో జరిగిన ఈ దాడి మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/