అమెరికాలో కాల్పులు..ముగ్గురు మృతి

shooting

Gun fire

సెయింట లూయీస్‌: అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. మిస్సోరీలోని సెయింట్‌ లూయీస్‌ నగరంలోని ప్రెవె 4000 బ్లాక్‌లోని ఓ ఇంట్లోకి దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల మోతలో ముగ్గురు  ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులంతా 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉన్న నల్లజాతీయులని వెల్లడించారు. అయితే అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా కాల్పులు ఎవరు జరిపారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/