పేలిన ఐఇడి బాంబు…ముగ్గురు మృతి

ied-bomb-blast
ied-bomb-blast

ఛత్తీస్‌గఢ్‌ : కాంకేర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఐఇడి బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. రహదారిపై మావోయిస్టులు ఐఇడి బాంబులు అమర్చారు. పోలీసులను టార్గెట్ గా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఈ బాబు పేలి వాహంనలో వెళుతున్న ముగ్గురు సాధారణ పౌరులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనతో పోలీసులు మావోయిస్టుల కోసం కాంకేర్ జిల్లాలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/